ఏపీలో కాంగ్రెస్, వామ పక్షాలు కలిసి పోటీ చేయబోతున్నాయా..?

తెలంగాణ అసెంబ్లీ ఘట్టం ముగియడం తో అంత ఏపీ ఫై ఫోకస్ చేసారు. ఏప్రిల్ నెలలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఏ పార్టీ అధికారం చేపడుతుందో అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఇదే తరుణంలో పొత్తులకు సంబదించిన వ్యవహాలు సైతం ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు ఖరారు కాగా..బిజెపి వీరితో జత కలుస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ఇక అధికార పార్టీ వైసీపీ సింగిల్ గా బరిలోకి దిగబోతున్నట్లు ఇప్పటికే తేల్చి చెప్పింది.

తాజాగా కాంగ్రెస్, వామ పక్షాలు కలిసి పోటీ చేసే అంశంపై ఢిల్లీ లో చర్చలు సాగుతున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్ లో సుదీర్ఘ సమాలోచనలు చేశారు కాంగ్రెస్‌, లెఫ్ట్‌ నేతలు.. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మధ్య శనివారం మంతనాలు జరిగాయి.. ఏపీలో రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల పై కాంగ్రెస్, సీపీఐ సమాలోచనలు చేస్తుంది.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు (కాంగ్రెస్‌, సీపీఐ).. సీపీఎంతో కలసి పోటీ చేసే అంశంపై చర్చలు సాగినట్టుగా చెబుతున్నారు.. “ఇండియా” కూటమి తరపున ఏపీలో పోటీ చేసి సత్తా చూపాలని యోచనలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు ఉన్నాయట. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.