త్వరలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు

కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు హెచ్చరిక

Corona third wave threat soon
Corona third wave threat soon

New Delhli: త్వరలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందని, మూడో దశ ఎప్పుడు,ఎలా వస్తుందో చెప్పలేమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు డాక్టర్ కె విజయ్ రాఘవన్ హెచ్చరించారు. థర్డ్‌ వేవ్‌ నాటికి మరిన్ని మార్పులు చెందే అవకాశముందని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు కూడా వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రపంచంతో పాటు భారత్ లో కూడా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని. దేశంలో కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ తయారు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత వ్యాక్సిన్లు బాగానే పని చేస్తున్నాయని , కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/