పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్‌ మసాలాపై ఏడాది పాటూ నిషేధం విధించింది. ఈనెల 7 నుంచి ఏడాది పాటు నిషేధం అమల్లో ఉంటుంది. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నిటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ మేరకుకుటుంబ సంక్షేమ,ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని ఏ పేరుతో నైనా తయారు చేయడం, అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం నేరం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

ఏపీలోనే కాదు తెలంగాణలోనూ గుట్కా, పాన్ మసాలాలపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో గుట్కా నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారని హైకోర్టు సీరియస్ అయ్యింది