బుజ్జగించి పనులు చెప్పాలి

Appeal and say things to children

పిల్లల్లో క్రమశిక్షణ, క్లాసులో అల్లరివాడ్ని కంట్రోల్‌ చేయాలంటే కొట్టడం, తిట్టడం బదులుగా అల్లరి చేసిన పిల్లవాడ్ని గోడవైపు తలపెట్టి అటే చూస్తుండమనాలి.

క్లాసు పిల్లలు వాడి వీపు వెనుక ఉంటారు. అలా ఓ పావ్ఞగంట నించో పెట్టాక ‘సారీ టీచర్‌! నేనింక అల్లరిచేయను అని బుద్ధిగా మసలుతాడు. ఈ విషయాన్ని అమెరికన్‌ చైల్డ్‌ సైకాలజిస్టులు తెలిపారు.

పిల్లల్ని ఈ పనిలో మీరు నాకు సాయం చేయండి అంటే చేయరు. 16ఏళ్ల ఆడపిల్ల కూడా తల్లికి వంటింట్లో సాయపడదు. ‘పాపా! నేను బాగా అలసిపోయాను. ప్లీజ్‌, చా§్‌ు తయారుచేయవూ? కాస్త ఆ గ్లాసులు కడగవూ? అని బుజ్జగించి అడగాలి. కాలిఫోర్నియా యూనివర్శిటీ ఈ మధ్య రీసెర్చి చేసి ఓ విషయాన్ని కనుగొంది.

అదేమిటంటే, ప్రేమలేక, అది తక్కువ అయి అవిశ్వాసం వల్ల పెళ్లిళ్లు బెడిసి కొడుతున్నాయట. మనం ఒకర్ని ఒకరు మోసగించుకోరాదు అని వధూవరులు మనఃపూర్వకంగా అనుకుని ఆచరించాలి. అడ్జస్టు అవ్వాలి. 20వేల మంది పై సర్వే చేస్తే ఓ కొత్త విషయం బైటపడింది. 80శాతం మంది సండే నైట్‌ ఇస్నోమ్నియాతో బాధపడుతున్నారుట.

ఆదివారం రాత్రి నుంచే మర్నాటి మీటింగుకి కావల్సిన హంగామా, పూర్తి కావల్సిన ఫైల్స్‌ని గూర్చి ఆలోచిస్తారుట. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం దాకా భలే ఉషారుగా ఉండే వ్యక్తులు ఆదివారం రాత్రి చిరచిరలాడతారుట. ఆటపాటలతో, డ్రాయింగ్‌, మ్యూజిక్‌తో గడపాలి. అప్పుడు ఈ చికాకులు పోతాయి అంటున్నారు నిపుణులు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/