అలసిన కళ్లకు..

Tired eyes

ఒత్తిడి బాగా ఉన్నప్పుడు కొందరిలో కళ్లు నొప్పిగా ఉండటం, కళ్లు లాగినట్లు అనిపించడం, కళ్ల వెంట నీరు కారడం జరుగుతుంది. టివి, మొబైల్స్‌ ఎక్కువగా వాడటం, కంప్యూటర్‌పై ఎక్కువగా పనిచేయడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి పడి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ప్రతి గంటకోసారి కళ్లను గట్టిగా కాకుండా, మృదువుగా మూసుకుని, కళ్లపై మునివేళ్లతో నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇది గుండ్రంగా చేయాలి. మొదట క్లాక్‌వైజ్‌గా అయిదు సార్లు ఆ తరువాత యాంటీక్లాక్‌వైజ్‌గా మరో అయిదుసార్లు చేయాలి. కళ్లకు ఆహ్లాదంగా ఉండే రంగు లైట్‌ గ్రీన్‌. కాబట్టి కిటికీలోంచి పచ్చటి చెట్లను చూడవచ్చు. లేదా కంప్యూటర్‌ మానిటర్‌ పక్కన ఇన్‌డోర్‌ ప్లాంట్స్‌ పెట్టుకుని చూస్తుండటం కూడా మంచి పద్ధతి. కంప్యూటర్‌ / మొబైల్‌ ఫోన్స్‌లో రీడింగ్‌ మోడ్‌లో ఉంచి చదవడం మంచిది. రోజూ రాత్రి పడుకునే ముందు కళ్లమీద తాజా నీటిలో ముంచి తడిగుడ్డ కాసేపు ఉంచుకోవడం మంచిది. వీటన్నింటి వల్ల ప్రయోజనం కనిపించినప్పుడు ఒకసారి కంటి డాక్టర్‌ను సంప్రదించి ఐసెట్‌ చెక్‌ చేయించుకోవాలి.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health/