మరికాసేపట్లో ఏపీ జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

మరికాసేపట్లో ఏపీ జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

మరికాసేపట్లో రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరగబోతుంది. ఒక్క చైర్మన్లు మాత్రమే కాదు.. వైస్ ఛైర్మన్ల ఎన్నిక కూడా జ‌రుగ‌నున్న‌ది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీటీసీలు సమావేశమై జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 640 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అన్ని జిల్లాల్లో నేటి ఉదయం 10 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం.. అనంత‌రం .. మ‌ధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్‌, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఎన్నికలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు.

జెడ్పీ ఛైర్మన్లు ఎవరనేది చూస్తే..

కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ – ఉప్పాళ్ల హారిక
గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ – క్రిస్టినా
ప్రకాశం జడ్పీ ఛైర్మన్ – బూచేపల్లి వెంకాయమ్మ
నెల్లూరు జడ్పీ ఛైర్ పర్సన్ – ఆనం అరుణమ్మ
కర్నూలు జడ్పీ ఛైర్మన్ – వెంకట సుబ్బారెడ్డి
కడప జడ్పీ ఛైర్మన్ – ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి
అనంతపురం జడ్పీ ఛైర్మన్ – బోయ గిరిజమ్మ
విజయనగరం జడ్పీ ఛైర్మన్ – మజ్జి శ్రీనివాస్
శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్ – పిరియా విజయ
విశాఖపట్నం జడ్పీ ఛైర్మన్ – అరిబిరా
తూర్పుగోదావరి జడ్పీ ఛైర్మన్ – విప్పర్తి వేణుగోపాల్
పశ్చిమ గోదావరి జడ్పీ ఛైర్మన్ – కౌరు శ్రీనివాస్
చిత్తూరు జడ్పీ ఛైర్మన్ – వి.శ్రీనివాసులు