యూఎస్ కలెక్షన్స్ దుమ్ములేపాయి!

నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య నిన్న (సెప్టెంబర్ 24) వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా.. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. మొదటి రోజు మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లోను లవ్ స్టోరీ వసూళ్లు దుమ్ములేపాయి.

అమెరికాలో 224 లొకేష‌న్స్‌లో ల‌వ్‌స్టోరి ప్రీమియ‌ర్స్ వేస్తే.. 3,07,103 డాల‌ర్స్ వసూలు చేసింది. ఇక తొలిరోజు 2,34,000 డాల‌ర్స్ వ‌సూళ్ల‌ను సాధించింది. ప్రీమియర్స్‌తో కలుపుకుని మొత్తంగా 540000 డాల‌ర్స్ కొల్ల‌గొట్టింది ల‌వ్‌సోర్టీ. మన దేశ కరెన్సీలో మొత్తంగా రూ.4.40కోట్ల కలెక్షన్లు రాబట్టి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపినింగ్ కలెక్షన్ల రాబట్టిన సినిమాగా నిలిచింది. సినిమా పెద్ద సక్సెస్ కావడం తో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాల్లో మునిగితేలుతోంది. మరోపక్క చిత్రసీమ సైతం లవ్ స్టోరీ సక్సెస్ తో ఊపిరి పీల్చుకుంటుంది. మొన్నటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారో రారో అనే ఖంగారులో ఉండగా..నిన్న ఫ్యామిలీ ఆడియన్స్ సైతం థియేటర్స్ కు పరుగులు పెట్టడం తో తమ సినిమాలను థియేటర్స్ లలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.