ఏపిలో ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

ap-students-sankranthi-holidays-for-schools-from-9th-of-this-month

అమరావతిః ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈనెల 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖధికారులు అన్ని యాజమాన్యాలకు ఆదేశాలు ఇస్తున్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 19న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కాగా, తెలంగాణలో ఈ నెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

అటు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో మిషనరీ స్కూల్ లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని వెల్లడించింది.