నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు పున : ప్రారంభం

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి

School children-
School children-

Amravati: ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే నాలుగైదు నెలలుగా స్కూల్స్ ప్రారంభించలేకపోయామని చెప్పారు.

ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించామని, అదే పద్ధతిలో హైస్కూల్ విద్యార్థులకు కూడా సిలబస్ కుదిస్తామని మంత్రి తెలిపారు.

స్కూల్స్ ప్రారంభమయ్యేలోపు విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/