చంద్రబాబు హయంలోనే ఈఎస్‌ఐ స్కాం జరిగింది

ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉంటే అన్ని శాఖలను టిడిపి దోచుకుంది

gummanur jayaram
gummanur jayaram

కాకినాడ: ప్రభుత్వంలో ఎన్ని శాఖలుంటే అన్ని శాఖలను టిడిపి దోచుకుందని ఆంధ్రప్రదేశ్‌ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈఎస్‌ఐ స్కాంలో రూ. 300 కోట్లు అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. మాజీ కార్మిక మంత్రులు అచ్చెంనాయుడు, పితాని సత్యనారయణ హయంలోనే ఈ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. దీంతో నేడు చంద్రబాబు నాయుడు ముద్దాయి అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక చంద్రబాబుతో పాటు అప్పటి కార్మికశాఖ మంత్రులిద్దరూ కూడా జైలుకు వెళ్లే పరిస్థితి దగ్గర్లోనే ఉందని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/