ఏపీ SI పరీక్షా ఫలితాలు విడుదల

ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన ప్రిలిమ్స్‌ రాత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) విడుదల చేసింది. 411 పోస్టులకు గాను ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 1,51, 288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అర్హత సాధించారు. మార్చి 4వ తేదీ వరకు OMR షీట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశముంద‌ని APSLPRB పేర్కొంది. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి.

వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కలిగి ఉన్న పరీక్ష. దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.