ఏపి పోలీస్‌ సేవ యాప్‌ ప్రారంభోత్సవం

రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ కొత్త యాప్

ఏపి పోలీస్‌ సేవ యాప్‌ ప్రారంభోత్సవం
cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖ సరికొత్త యాప్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ రూపొందించిన కొత్త యాప్‌. ఈ యాప్‌ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని నేరాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశంతోపాటు ఫిర్యాదులకు రశీదు కూడా పొందే అవకాశం ఉంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదులతో పాటు అత్యవసర సమయాల్లో వీడియో కాల్‌ చేసే సౌకర్యం కూడా ఉంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.

దర్యాప్తు పురోగతి, అరెస్ట్‌లు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రహదారి భద్రత,.. సైబర్‌ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు కూడా ఈ యాప్‌ ద్వారా పొందవచ్చు. వీటితో పాటు ఎన్‌వోసీలు, లైసెన్సులు,పాస్‌పోర్ట్‌ సేవలు, ఇతర వెరిఫికేషన్లు అన్ని పోలీసు సేవలను కూడా అందుబాటులో ఉంటాయి. మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌తో మహిళల కు రక్షణగా, తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ యాప్ సేవలను అందిస్తుంది. తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం వైఎస్‌ జగన్‌త్‌ పాటు డీజీపీ గౌతవ్‌ సవాంగ్‌ ముఖ్య పోలీసు అధికారులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/