వివేకా హత్య కేసు…పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం

వివేకా హత్య కేసు…పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం
వివేక హత్య జరిగిన రోజు నివాసంలోకి ఎవరెవరు వెళ్లారనే విష‌యంపై ఆరా

కడప : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) విచార‌ణ కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో అధికారులు పలువురిని విచారించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అధికారులు కీల‌క వివ‌రాలు రాబ‌ట్టారు. వాటి ఆధారంగా త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

వివేక హత్య కేసులో భాగంగా సీబీఐ బృందం పులివెందులకు చేరుకుంది. వివేక నివాసంలో రెండవ రోజు సీన్ రీకన్‌స్ట్రక్షన్ జ‌రుగుతోంది. అప్ప‌ట్లో వివేక హత్య జరిగిన స‌మ‌యంలో ఆయ‌న‌ నివాసంలోకి ఎవరెవరు వెళ్లారనే విష‌యంపై సీబీఐ ఆరా తీస్తోంది. ఆ రోజు రాత్రి ఎవరెవరు ఇంట్లో తిరిగారు? అనే దానిపై వివ‌రాలు రాబ‌డుతోంది. షార్ట్ లెటర్స్‌తో టీషర్ట్‌లు వేయించి సీబీఐ బృందం రిహార్సల్స్ చేయిస్తోంది. వాటిపై సునీల్, దస్తగిరి, ఉమాశంకర్, రంగన్న పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/