హరీష్ రావు కు వైద్య ఆరోగ్య శాఖను అప్పగించిన కేసీఆర్

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గా ఉన్న హ‌రీష్ రావు కు మరో బాధ్యతను అప్పగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఉండేవారు. భూ అక్రమ కేసు కారణంగా కేసీఆర్ ఈటలను మంత్రి వ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేశాడు. ఆ తర్వాత ఆ బాధ్యతను కేసీఆర్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను హరీష్ రావు కు అప్పగించారు.

ఈ మేరకు తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ద‌స్త్రంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ సంత‌కం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు హ‌రీశ్ రావు ఆర్థిక శాఖ‌ను మాత్ర‌మే ప‌ర్య‌వేక్షించేవారు. ఇక నుంచి రెండు శాఖ‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది. కరోనా సమయంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా వైద్యారోగ్య శాఖను పర్యవేక్షించారు. ఆరోగ్య రంగం, కరోనా పరిస్థితులు, వసతులు తదితర అన్ని అంశాలపై అధికారులతో పలు దఫాలు సమీక్షలు నిర్వహించారు. కరోనా పరిస్థితులను నిత్యం గమనిస్తూ అధికారులకు సూచనలు చేశారు.