తెలంగాణ బిజెపి ఎంపీలపై మంత్రి కెటిఆర్‌ ఫైర్‌

రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు వచ్చాయని బిజెపి ఎంపీలు అంటున్నారు

TS Minister KTR-
TS Minister KTR-

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ తెలంగాణ బిజెపి ఎంపీలపై మండిపడ్డారు. కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్ల నిధులిచ్చిందని, అయితే సిఎం కెసిఆర్‌ వాటిని దారి మళ్లించారని బండి సంజయ్‌ చేసిన ఆరోపణలకు సంబంధించిన వార్తను కెటిఆర్‌ పోస్టు చేసి, ఆయన ఆరోపణలను తిప్పికొట్టారు. ‘కొవిడ్‌19పై పోరుకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు విడుదల చేసింది తెలంగాణ బిజెపి ఎంపీలు అంటున్నారు. కానీ, ఓ ప్రశ్నకు సమాధానంగా ఎన్డీఏ ప్రభుత్వం వివరాలు తెలుపుతూ తెలంగాణకు రూ.290 కోట్లు విడుదల చేశామని తెలిపింది’ అని కెటిఆర్‌ చెప్పారు. నిధుల విడుదల విషయాన్ని వక్రీకరిస్తూ ఇలా సిగ్గులేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బిజెపి తెలంగాణ నేతలపై ఆయన మండిపడ్డారు. నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/