ఏపి మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

బడ్జెట్ తీర్మానానికి ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ నేతృత్వంలో మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈసమావేశంలో బడ్జెట్ తీర్మానానికి మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. ఈ భేటీ తర్వాత శాసన సభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ప్రవేశపెట్టి ఓటాన్ అకౌంట్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జులై నుంచి రాబోయే తొమ్మిది నెలల కాలం కోసం పూర్తిస్థాయి బడ్జెట్ ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఇప్పటికే ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఉభయ సభలను ఉద్దేశించి వీడియో కాల్‌ ద్వారా గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగించనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/