కఠినంగా శిక్షించాల్సింది పోయి రాజీ కుదిర్చే ప్రయత్నం

దిశ చట్టం నిద్రపోతుందా వైఎస్ జగన్ గారు?

nara lokesh
nara lokesh

అమరావతి: ఏపి సిఎం జగన్‌పై టిడిపి నేత నారా లోకేశ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపిలో అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. అనపర్తిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించకుండా, రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. ‘దిశ చట్టం నిద్రపోతుందా వైఎస్ జగన్ గారు? తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యింది. చిన్నారిని చిదిమేసిన మృగాడు సత్యనారాయణ రెడ్డిని కఠినంగా శిక్షించాల్సింది పోయి, స్థానిక వైఎస్‌ఆర్‌సిపి నేతలు రాజీ కుదిర్చే ప్రయత్నం చెయ్యడం దారుణం’ అని నారా లోకేశ్ చెప్పారు. ‘చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా? 21 రోజుల్లో న్యాయం ఎక్కడ? ప్రచార ఆర్భాటంతో మొదటి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జిల్లాలోనే ఘోరాలు జరుగుతుంటే ఇక మిగిలిన చోట్ల ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది’ అని లోకేశ్ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/