నేడు హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని

రూ. 11వేల కోట్ల ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు


హైదరాబాద్: ప్రధాని మోడీ నేడు హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రూ.11,000 కోట్ల విలువైన జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అంతకుముందు, ఉదయం 11:30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సెకండ్ గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకకు పీఎం అధ్యక్షత వహించనున్నారు.

అనంతరం రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు నేడు మోక్షం కలగనుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలతో మాట్లాడి, ఈ ఆరింటిని ఏకతాటిపైకి తెచ్చింది. దాదాపు 7 వేల కోట్లతో 40 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఇది ఢిల్లీకి చాలా లాభదాయకంగా మారనుంది. దీని ద్వారా ఢిల్లీకి ప్రతి సంవత్సరం దాదాపు 500 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని సరఫరా చేయగలుగుతారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/