అక్టోబరు 5న ‘జగనన్న విద్యా కానుక’

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: సిఎం జగన్‌ స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ‘జగనన్న విద్యా కానుక’ అక్టోబర్ 5 నుంచే అమలు చేస్తామని చెప్పారు. జగనన్న విద్యాకానుక కిట్లు ముందుగానే విద్యార్థులకు అందితే పాఠశాలలు తెరిచేలోగా విద్యార్థులు యూనీఫామ్ కుట్టించుకోగలుగుతారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్కూళ్ల ప్రారంభాన్ని వాయిదా వేశామని ఆయన వెల్లడించారు.

కాగా ఏపిలో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ స్కూళ్ల ప్రారంభాన్ని నవంబర్ కు వాయిదా వేసింది. అక్టోబర్‌ 5న పిల్లలకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను ప్రభుత్వం అందజేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ నుంచి స్కూళ్లు ప్రారంభమవుతాయని చెప్పిన జగన్ సర్కార్ స్కూళ్ల ప్రారంభ తేదీని నవంబర్ 2కు వాయిదా వేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/