సీఎం జగన్ సహా 41 మందికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు

ప్రభుత్వ పథకాల మాటున అవినీతి జరుగుతోందంటూ రఘురామ కృష్ణరాజు పిటిషన్

cm-jagan

అమరావతిః ఏపీలో ప్రభుత్వ పథకాల మాటున భారీ అవినీతి చోటుచేసుకుంటోందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే, ఈ పిల్ లో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని, వ్యక్తిగత కారణాలతోనే ఈ పిటిషన్ వేశారంటూ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇది విచారణకు అర్హత ఉన్న పిటిషన్ కాదని కోర్టుకు విన్నవించారు. రఘురామ తరఫు న్యాయవాది స్పందిస్తూ, తమ క్లయింటు పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని న్యాయస్థానానికి వివరించారు. వాదనలు విన్న పిమ్మట హైకోర్టు ధర్మాసనం సీఎం జగన్ సహా 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదుల జాబితాలో సీఎంతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. తదుపరి విచారణను డిసెంబరు 14కి వాయిదా వేసింది.