జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం

JanaSena Party
JanaSena Party

విజయవాడ: జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ… ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు 60 మంది వరకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని..హైదరాబాద్‌లో కూడా జనసేన అక్టీవ్‌గా ఉందని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసైనికులు ఎన్నో ప్రాంతాల్లో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. జనం మద్దతు జనసేనకు బలంగా ఉందని.. దాన్ని ఓట్లుగా మారుస్తామని ఆయన తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఐదు లక్షల భీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యచరణ సిద్ధం చేశామని… పార్టీ విధానాలకు అనుగుణంగా అందరూ కలిసి పని చేస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/