దుల్హన్ పధకంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
దుల్హన్ పధకంపై వెంటనే నిర్ణయం తీసుకోండి..హైకోర్టు

అమరావతిః ఏపీ హైకోర్టులో గురువారం దుల్హన్ పథకంపై విచారణ జరిగింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే తాజాగా ఈ పథకాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు షిబ్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ఇప్పటికే ఓ దఫా విచారణ జరగగా… గురువారం మరో విడత విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా దుల్హన్ పథకాన్ని ఆపేశామని చెప్పారు కదా… అందుకు గల కారణాలేమిటో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని కోరింది. ఈ వివరణ అందజేసేందుకు తమకు 4 వారాల గడువు కావాలన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యర్థనను మన్నించిన కోర్టు… విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశమని వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున సీనియర్ న్యాయవాది మొహ్మద్ సలీం భాషా వాదనలు వినిపించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/