కార్తీ సర్దార్ ఓటిటి రిలీజ్ డేట్

కోలీవుడ్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం సర్దార్. అక్టోబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగు లోను సూపర్ హిట్ సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అభిమన్యుడు ఫేమ్ పి.ఎస్.మిత్రన్ సర్దార్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రతి పాత్రను దర్శకుడు తెరకెక్కించిన తీరు.. ముఖ్యంగా హీరో కార్తి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. కమర్షియల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఈ మూవీలో ఉండటంతో మూవీ అందరికీ కనెక్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. ఈ చిత్ర తెలుగు, తమిళ ఓటీటీ రైట్స్‌ను ఆహా దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 18వ తేదీ నుంచి తెలుగు, తమిళ భాషల్లో ‘సర్దార్’ స్ట్రీమింగ్‌ కానుంది.

ఇదిలా ఉంటె పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ‘సర్దార్’ చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ సీక్వెల్ ని కూడా రూపొందించనున్నారు. మొదటి భాగంలో భాగమైన నటీనటులు సాంకేతిక నిపుణుల బృందం ఈ సీక్వెల్ కోసం వర్క్ చేయనున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.