వివేకా హత్యకేసు.. నిందితుడు దస్తగిరికి బెయిల్

ap-high-court-grants-bail-to-dastagiri

అమరావతిః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండి, అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరికి ఏపీ హైకోర్టు కాసేపటి క్రితం బెయిల్ మంజూరు చేసింది. ఒక కిడ్నాప్ కేసులో దస్తగిరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 86 రోజులుగా దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టులో దస్తగిరి తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ సాయంత్రం ఆయన బెయిల్ పై విడుదలయ్యే అవకాశం ఉంది. ఈరోజు వీలు కాకపోతే రేపు ఉదయం ఆయన విడుదలవుతారు.