వార‌ణాసిలో ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ప్రధాని ప్రసంగం

YouTube video
PM Shri Narendra Modi addresses Vishal Jan Sabha in Varanasi Rural, Uttar Pradesh

ల‌క్నో: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శ‌నివారం త‌న నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలో ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ప్రసంగించారు. ఈసందర్బంగా ఆయన విప‌క్షాల‌పై విరుచుకుప‌డ్డారు. ఉక్రెయిన్ అంశాన్నీ యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. దేశం ముంగిట ప‌లు స‌వాళ్లు ఎదురైన సంద‌ర్భంలో విప‌క్షాలు వాటిని త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌న భ‌ద్ర‌తా ద‌ళాలు, ప్ర‌జ‌లు సంక్షోభాన్ని అధిగ‌మించేందుకు పోరాడుతుంటే వాటిని మ‌రింత సంక్లిష్టం చేసేందుకు వారు (ప్ర‌తిప‌క్షాలు) అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తార‌ని మండిప‌డ్డారు. క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో ప్ర‌స్తుతం ఉక్రెయిన్ సంక్షోభంలోనూ విప‌క్షాల తీరును మ‌నం చూశామ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/