మాజీ మంత్రి నారాయణ నివాసంలో సీఐడీ సోదాలు

ఏక కాలంలో కొనసాగుతున్న సోదాలు

నెల్లూరు: టీడీపీ, మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నారాయణకు చెందిన కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో అన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఆయన అందుబాటులో లేకపోవడంతో నారాయణ భార్యకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22న విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.


అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారాయణకు సీఐడీ అధికారులు నిన్న నోటీసులు అందజేశారు. ఈ నెల 23న విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు జరుపుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/