కర్నూల్ లో మైనర్ బాలికల ఫై పాస్టర్‌ లైంగిక దాడి..

ఏపీలో రోజు రోజుకు మహిళలకు , మైనర్ బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క ప్రభుత్వం , పోలీసులు కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధులు మాత్రం ఆగడం లేదు. తాజాగా కర్నూల్ లో ఓ చర్చి పాస్టర్ ..మైనర్ బాలికలఫై లైంగిక దాడి చేసి వార్తల్లో నిలిచారు.

వివరాల్లోకి వెళ్తే..

చాగలమర్రి మండలంలో ప్రసన్న కుమార్ ఓ చర్చికి పాస్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. తన చర్చికి వచ్చే మైనర్ బాలికలపై కన్నేసిన ప్రసన్న కుమార్..పెద్దలు పనికి వెళ్లిన సమయంలో.. బాలికలను ప్రేయర్‌ పేరుతో చర్చిలోకి తీసుకువెళ్లేవాడు. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులకు మాయమాటలు చెప్పి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పాస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విషయం బయటకు రాకుండా ఉండేందుకు పాస్టర్.. పెద్ద మనుషుల ద్వారా పంచాయితీ నడిపించాడు.

పాస్టర్ ప్రసన్న కుమార్ లైంగిక వేధింపులపై ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చాగలమర్రి పోలీసులకు చేరడంతో.. పాస్టర్ ప్రసన్న కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. పాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.