విశాఖ ఘటనపై ఏపి గవర్నర్‌ దిగ్భ్రాంతి

Biswabhusan Harichandan
Biswabhusan Harichandan

న్యూఢిల్లీ: విశాఖలో ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పాలమర్స్‌ పరిశ్రమలో ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల తరలింపులో రెడ్‌క్రాస్ వాలంటీర్‌ల సేవలను వియోగించుకోవాలని సూచించారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్‌క్రాస్‌కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/