పిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి దయనీయం

గ్యాస్ లీక్ ప్రభావం తీవ్రం

Vizag leakage incident
Vizag leakage incident

Visakhapatnam: విశాఖపట్టణంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైన ఘటనలో ముగ్గురు మరణించినట్లు అధికారికంగా చెబుతున్నారు.

విధినిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్ కుప్పకూలారు. రోడ్డు పక్కనే పలువురు అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తున్నది.

మూడు వందల మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వరకూ ఈ కెమికల్ గ్యాస్ ప్రభావం ఉందని చెబుతున్నారు.

ఐదు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. పిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి దయనీయంగా ఉంది.

తెల్లవారు జామున గ్యాస్ లీక్ అవ్వడంతో వెంటనే గుర్తించలేకపోవడం వల్ల ప్రభావం తీవ్రమైందని అంటున్నారు.

లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో కంపెనీ తెరిచే క్రమంలో ఈ దుర్ఘటన సంభవించి ఉండొచ్చని తెలుస్తున్నది.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/