సింగర్ మంగ్లీకి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్..సింగర్ మంగ్లీకి కీలక బాధ్యతలు అప్పగించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా మంగ్లీని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం, బసినేపల్లె తాండకు చెందిన మంగ్లీ.. ప్రస్తుతం టాప్ సింగర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బోనాల సాంగ్స్ తో ఎంతో ఫేమస్ అయినా మంగ్లీ..ప్రస్తుతం అన్ని భాషల్లో సాంగ్స్ పాడుతూ అలరిస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్..మంగ్లీకి ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రెండేళ్ల పాటు మంగ్లీ ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులకు కూడా ఇటీవలే సీఎం జగన్ కీలక పదవులు కట్టబెట్టిన విషయం తెలిసిందే. నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. అలాగే, ప్రముఖ కమెడియన్ ఆలీని ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహాదారు పదవి వరించింది. తాజాగా, మంగ్లీని ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమించారు.