మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ లో ఐటీ రైడ్స్ ఎక్కువయ్యాయి. ముఖ్యముగా టిఆర్ఎస్ నేతలను టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది నేతల ఇళ్ల ఫై , ఆఫీస్ లపై సోదాలు జరిపిన అధికారులు ..తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇంటిపై , ఆఫీస్ లపై దాడులు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.

రంగారెడ్డి , హైదరాబాద్ ఇరు జిల్లాల్లో మొత్తం 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో అలాగే మల్లారెడ్డి కూతురు కొడుకు, అల్లుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో మొత్తం 50 బృందాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల, తెలంగాణలోని మరో మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లల్లో ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే.