సెల్ఫీ ఫోజులతో కాకరేపుతున్న శివాత్మిక

సెల్ఫీ ఫోజులతో శివాత్మిక రాజశేఖర్ కాకరేపుతుంది. ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీ కి పరిచమైన శివాత్మిక ..ఆ మూవీ దారుణమైన ఫలితాన్ని ఇవ్వడంతో కాస్త నిరాశకు గురైంది. ఆ తరవాత ఆమె ఒక తమిళ సినిమాలో నటించింది. అది కూడా మెప్పించలేకపోయింది. ఈ మధ్యనే ‘పంచతంత్రం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది.

దీంతో అమ్మడికి ఛాన్సులు కష్టమే అని అంత మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో తనలోని హాట్ యాంగిల్ ను బయటకు తీసి , ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈ భామ..తాజాగా అద్దం ముందు హాట్ హాట్ సెల్ఫీ ఫోటో దిగి వాటిని సోషల్ మీడియా లో షేర్ చేయగా ఆ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లామర్ ను నమ్ముకున్న శివాత్మిక కు కాలం కలిసి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.