ఏపీలో ఎంసెట్ షెడ్యూల్‌ విడుదల

అమరావతి: ఏపీ ఎంసెట్ షెడ్యూల్‎ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ గా మార్చుతున్నట్లు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా ఎప్‎సెట్‎ను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈనెల 24న నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని, జులై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వివరించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/