దేశంలో కొత్తగా 1,61,386 కరోనా కేసులు
మొత్తం మృతుల సంఖ్య 4,97,975

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 1,61,386 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 2,81,109 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 16,21,603 మంది చికిత్స తీసుకుంటున్నారు.
కరోనాతో నిన్న 1,733 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,97,975కు చేరింది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,95,11,307గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.26 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 167.29 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/