తల్లి కాబోతున్న నటి పూర్ణ

నటి పూర్ణ తల్లి కాబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే అభిమానులకు తెలిపి తన సంతోషాన్ని పంచుకుంది. శ్రీమహాలక్ష్మి ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుసగా పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు బుల్లితెర ఫై కూడా మెరిసింది.

ఇక అక్టోబర్ లో ఈమె దుబాయ్ లో స్థిరపడిన వ్యాపారవేత్త జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో శానిద్ ఆసిఫ్ ఆలీని షమ్న కాసిం ను పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. దుబాయ్ లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. పెళ్ళైన రెండు నెలలకే తాను తల్లి కాబోతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది.