ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌ టికెట్లు విడుదల

ap-eamcet-hall-tickets-released

అనంతపురం: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హాల్ టిక్కెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఏపీఈఏపీసెట్-2023 వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ వివరాల ప్రకారం ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు అందాయి. వీటిల్లో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055, వ్యవసాయ, ఔషధ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చాయి. 

ఈ నెల 15 నుంచి 19 తేదీల మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయని అధికారులు చెప్పారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ విషయంలో సందేహాలున్న వారు 08554-23411, 232248 ఫోన్ నెంబర్ల ద్వారా సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. కాగా, హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి: https://rb.gy/q3pfs