భారత్ జోడో యాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీపావళికి ముందు రోజు తెలంగాణ లో రాహుల్ అడుగుపెట్టారు. మొదటి రోజు నాల్గు కిలోమీటర్లు కొనసాగింది. ఆ తర్వాత దీపావళి సందర్బంగా మూడు రోజుల బ్రేక్ ఇచ్చారు. రేపటి నుండి రాహుల్ యాత్ర పున: ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో భారత్ జోడో యాత్ర పోస్టర్ను బుధువారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు.

పాదయాత్ర జగిత్యాల చేరుకున్న అనంతరం భారత్ జోడో యాత్రలో పాల్గొంటామని అన్నారు. జోడో యాత్రకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. భారత జాతి ఐక్యతకు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పోస్టర్లు ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న మల్లిఖార్జున్ ఖర్గేకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. అధికార కాంక్షతో దేశాన్ని కులాల మతాల పేరుతో ఎన్డీయేగా విభజించడాన్ని నిరసిస్తూ.. రాహుల్ జోడో యాత్ర కొనసాగుతోందని జీవన్ రెడ్డి అన్నారు. నెహ్రూ హయాంలో జాతీయ స్థాయిలో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని అన్నారు.