ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు టీకాలు: ఏపీ

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడి

Vaccines for mothers with children under five: AP
Vaccines for mothers with children under five: AP

Amaravati: కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం , ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా ఇస్తున్నారు. అయితే, పిల్లల తల్లులకు టీకా వేసే విషయంలో మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ మూడో దశ కనుక తీవ్రంగా ఉండి ఆసుపత్రులలో చేరాల్సి వస్తే పిల్లలకు సాయంగా ఉండాల్సింది తల్లులేనని, కాబట్టి వారికి తొలుత టీకా ఇవ్వాలని ప్రత్యేక కమిటీ సిఫార్సు చేసిందని, దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సింఘాల్ తెలిపారు.

రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల మంది పిల్లల తల్లులకు టీకాలు వేస్తామని, వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/