ఫోర్జరీ కేసులో మహాత్మా గాంధీ ముని మనుమరాలికి జైలు
దక్షిణాఫ్రికా న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు

Durban (South Africa): మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్గోబిన్ కు దక్షిణాఫ్రికా న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఫోర్జరీ కేసులో రూ.3.23 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెను దోషిగా నిర్ధారించి డర్బన్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఎస్ఆర్ మహరాజ్ అనే వ్యాపారవేత్తను లతా మోసం చేసినట్లు పేర్కొంది. భారత్ నుంచి వచ్చే ఓ కన్సైన్మెంట్ నిమిత్తం కస్టమ్స్ సుంకం కోసం అడ్వాన్స్‌గా 6.2 మిలియన్ ర్యాండ్స్ వ్యాపారవేత్త నుంచి వసూలు చేశారు. ఆ కన్సైన్మెంట్ ద్వారా వచ్చే లాభాల్లో కొంత ఆయనకు వాటా దక్కుతుంది. కానీ, అటువంటి కన్‌సైన్‌మెంటే లేదనీ నకిలీ పత్రాలను సృష్టించి లతా ఆయన్ని మోసం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసు విచారణ 2015లోనే ప్రారంభమైంది. ఆశిష్ లతా రాంగోబిన్ ప్రముఖ హక్కుల ఉద్యమకర్త ఎలా గాంధీ, దివంగత మేవా రామ్‌గోబింద్‌ల కూతురు. భారత్, దక్షిణాఫ్రికాల నుంచి పలు గౌరవ సత్కారాలను అందుకున్నారు. వారి కుమార్తె ఆశిష్ లతా మోసపూరిత కేసులో దోషిగా జైలుపాలయ్యారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/