వింత వ్యాధి బాధితులకు జగన్ పరామర్శ

మెరుగైన చికిత్స అందించాల‌ని ఆదేశాలు జారీ

AP CM YS Jagan Consolaton
AP CM YS Jagan Consolaton

Eluru: ఏలూరులో వింత వ్యాధికి గురై వివిధ హాస్ప‌ట‌ల్స్ చికిత్స పొందుతున్న బాధితుల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు.

చికిత్స పొంద‌తున్న వారికి ధైర్యం చెప్పారు. వైద్యుల‌తో వ్యాధి గురించి చ‌ర్చించారు.. బాధితుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

సీఎం జగన్‌ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో ఈ వింత వ్యాధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

కాగా, గ‌త మూడు రోజులుగా ఏలూరు ప‌లువురు పిట్స్ తో ప‌డిపోయి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.. ఇలా మొత్తం 345 మంది వ‌ర‌కు బాధితులున్నారు.

వారిని వెంట‌నే చికిత్స కోసం వివిధ హాస్ప‌ట‌ల్స్ కు త‌రలించారు.. ఇప్ప‌టికే 150 మందికి పైగా హాస్ప‌ట‌ల్స్ నుంచి డిశ్చార్జ్ చేశారు.. మిగిలిన వారిలో 10 మందిని మెరుగైన చికిత్స కోసం విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/