కృష్ణ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించిన బాలకృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నందమూరి బాలకృష్ణ నివాళ్లు అర్పించారు. ప‌ద్మాల‌యా స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని ఉంచారు. ఉదయం నుండి తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు అభిమానులు బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాదు పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది అభిమానులు చేరుకొన్నారు. ఓ గొప్ప నటులను కోల్పాయామని వారంతా బాధపడుతున్నారు. అభిమానులతో పాటు సినీ స్టార్స్ సైతం కృష్ణ కు నివాళ్లు అర్పిస్తున్నారు.

కొద్దీ సేపటి క్రితం నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కృష్ణ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు. అనంతరం మహేష్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ముల , త్రివిక్రమ్, మెహర్ రమేష్ తదితరులు నివాళ్లు అర్పించారు. మరికాసేపట్లో ఏపీ సీఎం జగన్ కృష్ణ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత పూజా కార్య క్రమాలు జరిపి, అంతిమ యాత్ర మొదలుపెడతారు. 3 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ గారి అంత్యక్రియలు జరగనున్నాయి.