షిప్‌యార్డు ప్రమాదంపై సిఎం ఆరా

తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సిఎం ఆదేశం

AP CM Jagan
AP CM Jagan

విశాఖ: హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ఘటనపై సిఎం జగన్‌ ఆరా తీశారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై వివరాలు తెలుసుకున్నారు. మరణాలు సంభవించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం, ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ లను ఆదేశించారు. అటు, మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా షిప్ యార్డు ప్రమాదంపై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలంటూ ఆర్డీవోకు స్పష్టం చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/