సైనా నెహ్వాల్‌ ఓటమి

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 మహిళల సింగిల్స్‌

saina nehwal
saina nehwal

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 మహిళల సింగిల్స్‌ సెకండ్‌ రౌండ్లో సైనా నెహ్వాల్‌ ఓటమి చవిచూసింది. థాయ్‌ షట్లర్‌ , ప్రపంచ 12వ ర్యాంకర్‌ బుసానన్‌ చేతిలో సైనా 23-21, 14-21, 16-21తేడాతో ఓటమి పాలైంది.

హోరా హోరీగా దాదాపు 68 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సైనా పోరాడి ఓడింది.

తొలి గేమ్‌లోనే వీరిద్దరూ అంచనాలకు మించి పోరాడటంతో విజయం ఇరువురి వైపు ఊగిసలాడింది. చివరకు సైనా సుదీర్ఘ ర్యాలీలతో రాణించి 23-21తో తొలి గేమ్‌ను గెలుచుకుంది. చివరి రెండు గేముల్లో బుసానన్‌ పుంజుకుని ఆధిక్యం సాధించింది. 14-21, 16-21 తేడాతో సొంతం చేసుకుని విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్లో కిదాంబి శ్రీకాంత్‌ వాకోవర్‌ ప్రకటించాడు. మలేసియా ఆటగాడు లీ జి జియాతో ఆడాల్సి ఉండగా కాలి కండరాలు పట్టేయడంతో నిష్క్రమించాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/