తెలుగులో తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన మోదీ

తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ, అమిత్ షా తెలుగు లో ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా మోదీ స్పందిస్తూ.. ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణ రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’ అని తెలిపారు.

‘దేశ ప్రగతి కోసం కట్టుబడిన యువత కృషితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని కోరుతూ… తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. ఈరోజు(జూన్ 2) తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం. సుదీర్ఘ పోరాటం, అలుపెరుగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. నేటితో ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని , తొమ్మిదోవ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భాంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భవ వేడుకలు జరుపుకుంటున్నారు.