జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టిన బే ఏరియా ఎన్నారైలు

Complaint to the President through the Consulate

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఎన్నారైలు తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బే ఏరియా ప్రముఖుల్లో ఒకరిగా ఉన్న జయరామ్‌ కోమటి ఆధ్వర్యంలో 4 బస్సులలో వందలాదిమంది ఊరేగింపుగా వెళ్ళి శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ సంజయ్‌ పాండాను కలిసి వినతిపత్రం సమర్పించారు.

అమరావతిలో జరుగుతున్న ఘోరాలను, ప్రభుత్వాలను నమ్మి తమ భూములు ఇచ్చినందుకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి బే ఏరియా నుంచి అమరావతి రైతుల తరఫున వీరంతా పెద్ద ఎత్తున ఎన్నారైలు తరలివెళ్లారు. సుమారు నాలుగు పెద్ద వాహనాల్లో వందలాది మంది కాన్సుల్‌ జనరల్‌ అపాయింట్మెంట్‌ తీసుకుని అమరావతి పరిస్థితి వివరించారు.
రాష్ట్రానికి మార్గం చూపిన వాళ్లం అవుతామని త్యాగాలకు సిద్ధమైతే వారి తలరాతలను, రాష్ట్ర భవిష్యత్తును చిదిమివేయడానికి జగన్‌ కంకణం కట్టుకున్నారని, ఇందులో జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయమని వారు రాష్ట్రపతికి ఇచ్చిన మెమొరాండంలో కోరారు. ఈ కార్యక్రమంలో జయరామ్‌కోమటితోపాటు, వెంకట్‌ కోగంటి, భక్తబల్లా తదితరులు పాల్గొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/