‘ధమ్కీ’ ట్రైలర్ చూసారా..?

Das Ka Dhamki trailer released

విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ధమ్కీ’. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , రిలీజ్ కు సిద్దమైన క్రమంలో ఈ చిత్ర ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. ‘దాస్ కా ధమ్కీ’ లో విశ్వక్ డబుల్ యాక్షన్ లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇది తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ ద్వారా తెలియజెప్పాడు. అయితే ఈ ట్రైలర్ 1.0 చూసిన తర్వాత ఇది ఎన్నో ఏళ్లగా చూస్తున్న రొటీన్ లైన్ తో తెరకెక్కిందనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూసిన వెంటనే ఎన్నో పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు.

‘ధమ్కీ’ ట్రైలర్ ని బట్టి చూస్తే వెయిటర్ గా పని చేసే విశ్వక్ సేన్.. కొన్ని వేల కోట్లకు వారసుడైన మరో విశ్వక్ స్థానంలోకి వెళ్లడం.. విలన్స్ తో ఫైట్ చేసి కంపెనీని నిలబెట్టడం.. ఫ్యామిలీలో మళ్ళీ సంతోషాన్ని నింపడానికి ప్రయత్నాలు చేయడం వంటివి కనిపిస్తున్నాయి. ఇలాంటి కథతో గతంలో చాల సినిమాలే వచ్చాయని తెలుస్తుంది. మరి ఈ సినిమా కూడా అలాగే ఉంటుందా..లేక కొత్తగా ఉంటుందా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 2023 ఫిబ్రవరిలో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.