జనవరి 21 నుండి అఖండ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ ..

Akhanda movie-Box office records breaking
Akhanda movie-Box office records breaking

బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. జనవరి 21 నుండి హాట్‌ స్టార్‌ లో ప్రీమియర్ మూవీ గా స్ట్రీమింగ్ కాబోతుంది. ‘సింహ’, ‘లెజెండ్’​ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్​ సినిమా అఖండ. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించారు. తమన్ సంగీతమందించగా, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ వచ్చింది. సినిమా విడుదలై దాదాపు నెల రోజులు కావొస్తున్నా ఇంకా చాల థియేటర్స్ లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాణిస్తుంది.

ఇదిలా ఉంటె ఈ మూవీ రీమేక్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. తాజాగా హిందీ డబ్బింగ్ రైట్స్ ను పెన్ ఇండియా లిమిటెడ్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ హక్కులను ఇద్దరు హీరోలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్‌తో కానీ, అజయ్ దేవగణ్‌తో కానీ రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.