ఏపిలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

జులై 22న (బుధవారం) మంత్రి వర్గ విస్తరణ

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఏపిలో కేబినెట్ విస్తరణకు  ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జులై 22న (బుధవారం) మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో బుధవారం ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభకు ఎన్నికవడంతో ఇటీవల మోపిదేవి వెంకటరమణ, పిల్లిసుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. వారి స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన నేతలను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మత్స్యకార కుంటుంబానికి చెందిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రుల శాఖల్లో కూడా మార్పులు ఉండకపోవచ్చని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/