అంతిమ పోరుకు భారత్ అమ్మాయిల రంగం సిద్ధం
పుట్టిన రోజు చిరకాల జ్ఞాపకంగా మారాలని హర్మన్‌ప్రీత్ కోరిక

మెల్‌బోర్న్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో అంతిమ పోరాటానికి రంగం సిద్ధమైంది. అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్, ఆతిథ్య ఆస్ట్రేలియా జట్లు మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో మొదలయ్యే టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆట మొదలవనుంది. ఏడు టోర్నీలు ఆడితే తొలిసారి ఫైనల్‌కు వచ్చిన భారత మహిళల జట్టు మొదటి కప్పును ముద్దాడాలని ఆశిస్తోంది. మరోవైపు రికార్డు స్థాయిలో ఆరోసారి ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఇప్పటికే అత్యధికంగా నాలుగుసార్లు కప్పు నెగ్గింది. అదే జోరుతో ఇప్పుడు ఐదోసారి విజేతగా నిలవాలని కోరుకుంటోంది. సొంతగడ్డపై ఆడడం ఆసీస్ టీమ్‌కు అనుకూలం కాగా, బలమైన జట్టుతో బరిలోకి దిగి టోర్నీలో అజేయంగా నిలవడం భారత్ బలం. నేడు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పుట్టిన రోజు కావడం విశేషం. దాంతో, జట్టును గెలిపించి ఈ రోజును చిరకాల జ్ఞాపకంగా మార్చుకోవాలని హర్మన్ కోరుకుంటోంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/