ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత అబ్దుల్ నజీర్ పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే కావడం విశేషం. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే ఉభయ సభలు వాయిదా పడనున్నాయి.

గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలి, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలను బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈనెల 24వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ. 2.60 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. మరోపక్క గవర్నర్ అబ్దుల్ నజీర్ తొలి ప్రసంగం కావడంతో సంయమనంతో వ్యవహరించాలని టీడీపీ ఎమ్మెల్యేల నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాతనే రియాక్ట్ అవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.